నల్గొండMarriguda Incident | కన్నప్రేమను మరిచి.. తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు!

Marriguda Incident | కన్నప్రేమను మరిచి.. తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు!

మర్రిగూడ మండల పరిధిలోని కుదబక్షపల్లి గ్రామంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగుచూసింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Marriguda Incident | మర్రిగూడ మండల పరిధిలోని కుదబక్షపల్లి గ్రామంలో ఒక హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. మానసిక స్థితి సరిగా లేని ఓ కుమారుడు కన్నతల్లిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Marriguda Incident | కుటుంబ కలహాలే కారణమా?

గ్రామానికి చెందిన కడారి అబ్బమ్మ భర్త పదేళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు ఒక కుమారుడు (యాదయ్య), ఒక కుమార్తె ఉన్నారు. యాదయ్యకు వివాహమైనప్పటికీ, గత కొంతకాలంగా భార్య అలివేలు తన వద్దకు రాకపోవడంతో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో తనను ఎవరైనా హాని చేస్తారనే భయం, అనుమానంతో యాదయ్య తరచూ తల్లితో గొడవ పడుతుండేవాడు.

Marriguda Incident | తల్లిపై కత్తితో దాడి..

మంగళవారం మానసిక స్థితిని పూర్తిగా కోల్పోయిన యాదయ్య, ఆవేశంతో తల్లి అబ్బమ్మపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు , 108 సిబ్బందికి సమాచారం అందించారు. అబ్బమ్మను చికిత్స నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Marriguda Incident | పోలీసుల అదుపులో నిందితుడు..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu Elections| తమిళనాడులో ముగిసిన ద్రవిడ శకం.. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో...

Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​వో, ఆర్డీవోల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad DRO Appointments |  రాష్ట్రంలో పలువురు అదనపు...

West Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం...

BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Victory Celebration | వెస్ట్ బెంగాల్, అస్సాం,...