అక్షరటుడే, వెబ్‌డెస్క్: India IT Rules | భారత ఐటీ నిబంధనలపై వచ్చిన విమర్శలకు అమెరికా America లోని భారత Bharat రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా గట్టిగా స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, భారత్‌లో మలవుతున్న ఐటీ రూల్స్‌ను “సెన్సార్షిప్”గా అభివర్ణించడం అసంపూర్ణమైన వాదన అని పేర్కొన్నారు.
India IT Rules | ఆర్మాన్ ఖాన్ రాసిన అభిప్రాయ కథనాన్ని
ఒక అంతర్జాతీయ పత్రికలో ఆర్మాన్ ఖాన్ రాసిన అభిప్రాయ కథనాన్ని ఉద్దేశిస్తూ క్వాత్రా వ్యాఖ్యలు చేశారు. తప్పుదారి పట్టించే వైరల్ సమాచారాన్ని అడ్డుకోవడం, సమాజానికి హాని కలగకుండా చూడటం వంటి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన చర్యలను సెన్సార్‌షిప్‌గా చిత్రీకరించడాన్ని తప్పుపట్టారు. ఆ సెన్సార్షిప్ పదం.. ఆకర్షణీయమైన శీర్షికకు దోహదపడుతుందేమో గానీ, అది లోతైన విశ్లేషణ కాదని ఆయన ఘాటుగా విమర్శించారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వపడుతుందని, దేశానికి అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, చురుకైన ఆంగ్ల – ప్రాంతీయ మీడియా వ్యవస్థ ఉన్నాయని క్వాత్రా ఈ సందర్భంగా గుర్తుచేశారు. హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన పోరాటాలకు దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉందని పేర్కొన్నారు.
India IT Rules | వాస్తవ సమస్యను వక్రీకరించడమే
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతను నిర్ధారించే అంశాన్ని “స్వేచ్ఛా భావ వ్యక్తీకరణ vs సెన్సార్షిప్” అనే కోణంలో వర్ణించడం సరి కాదని, అది వాస్తవ సమస్యను వక్రీకరించడమే అవుతుందని అన్నారు. ఈ రెండు అంశాలు వేర్వేరు పరిమాణాల్లో ఉండే విషయాలని ఆయన స్పష్టం చేశారు.
స్వేచ్ఛా భావ వ్యక్తీకరణకు, బాధ్యతకు మధ్య సరైన సమతుల్యత ఎలా సాధించాలనే విషయంపై చర్చలను ఎప్పుడూ స్వాగతిస్తామని క్వాత్రా పేర్కొన్నారు. అయితే, పక్షపాతపూరితమైన అభిప్రాయాలతో చర్చను ప్రారంభించడం నిర్మాణాత్మక దిశలోకి తీసుకురాదని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి బాధ్యతాయుతమైన సంభాషణలు అవసరమని క్వాత్రా అభిప్రాయపడ్డారు.
Hyderabad Trap Gang | అమ్మాయిలను ట్రాప్ చేసిన అన్నదమ్ములు.. సహకరించిన తల్లి

