అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tandur single window | నాగిరెడ్డిపేట(Nagireddypet) మండలం తాండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Tandur cooperative society) పాలకవర్గం మంగళవారం తిరిగి పదవీబాధ్యతలు స్వీకరించింది. గతేడాది డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ విండో పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలువురు సింగిల్ విండో ఛైర్మన్లు హైకోర్టును(Highcourt) ఆశ్రయించారు. విచారణ అనంతరం పాత పాలకవర్గాలకే తిరిగి పదవీ బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
Tandur single window | జిల్లా సహకార సంఘం అధికారి ఆదేశాల మేరకు..
హైకోర్టు తీర్పు.. జిల్లా సహకార సంఘం(District Cooperative Society) అధికారి రామ్మోహన్రావు ఆదేశాల మేరకు మంగళవారం తాండూరు సహకార సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గంగారెడ్డిని రైతులు, గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. రైతు సంక్షేమం, సొసైటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి మురళి, ఉపాధ్యక్షుడు బాబురావు, డైరెక్టర్లు సంగయ్య, స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు కిష్టయ్య, సంజీవులు, హనుమంత్‌రెడ్డి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: crop procurement | పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం : కేటీఆర్

