May 06 Market Analysis | పాజిటివ్​గా గ్లోబల్ క్యూస్.. పరుగులు తీయనున్న దేశీయ మార్కెట్లు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 06 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో ఉద్రిక్తతలు తగ్గేలా కనిపిస్తుండటంతో క్రూడ్ ఆయిల్ ధర కాస్త తగ్గుముఖం పట్టింది. ఇరాన్‌తో ఒప్పందం విషయంలో పురోగతి ఉందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ప్రకటించడంతో ఈక్విటీ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది.

దీంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ తోపాటు ఈయూ మార్కెట్లు ఎక్కువగా లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

May 06 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.03 శాతం, ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.27 శాతం లాభంతో ఉంది.

May 06 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.68 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.07 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 1.42 శాతం నష్టపోయింది.

May 06 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 6.27 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.07 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.63 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.56 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.03 శాతం లాభంతో ఉన్నాయి. జపాన్ లో పబ్లిక్ హాలిడే కారణంగా అక్కడి స్టాక్ మార్కెట్ లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.69 శాతం లాభంతో సాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,621 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,600 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.80 నుంచి 1.08 కు పెరిగింది.
  • విక్స్ 2.14 శాతం తగ్గి 17.9 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108.04 డాలర్లకు తగ్గింది.
  • యÖఎస్ డాలర్ ఇండెక్స్ 98.28 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.43 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలహీనపడి 95.28 వద్ద ఉంది.

Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *