CMRF Rules Tightened | సీఎంఆర్​ఎఫ్​ నిబంధనలు కఠినతరం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CMRF Rules Tightened | పేదలకు అండగా నిలుస్తున్న సీఎంఆర్​ఎఫ్​ పథకం (CMRF Scheme)లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకాన్ని దుర్వినియోగం చేయకుండా నిబంధనలు మరింత కఠినతరం చేసింది.

పేదలకు ప్రభుత్వం సీఎంఆర్​ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు దరఖాస్తు చేసుకుంటే.. అందులో కొత్త మొత్తం చెక్కుల రూపంలో అందిస్తోంది. ఈ పథకంతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. అయితే పలువురు సీఎంఆర్​ఎఫ్ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పారదర్శకతను పెంపొందించడం, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సహాయం అందేలా నిబంధనల్లో పలు మార్పులు చేసింది.

CMRF Rules Tightened | మొత్తం ఆన్​లైన్​లో..

ప్రస్తుతం సీఎంఆర్​ఎఫ్​ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలను ఎమ్మెల్యేకు అందించాల్సి ఉంటుంది. వారి సిఫార్స్​ మేరకు మాత్రమే చెక్కులు వస్తాయి. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు (CMRF Cheque)ల్లో పేరు, ఇతర వివరాల్లో తప్పులు దొర్లితే గతంలో మాన్యువల్‌ పద్ధతిలో సరి చేసేవారు. ఇక నుంచి పూర్తి ఆన్​లైన్​ చేశారు. ఆధార్​ కార్డు, బ్యాంక్​ ఖాతా, ఇతర వివరాలు తప్పుగా నమోదు అయితే సీఎంఆర్​ఎఫ్​ సాయం అందదు.

CMRF Rules Tightened | సిఫార్సులలో..

సీఎంఆర్​ఎఫ్​ చెక్కు కోసం బాధితులు తమ ఎమ్మెల్యే కార్యాలయాన్ని (MLA Office) సంప్రదించాలి. అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌లో రెవెన్యూ విభాగానికి దరఖాస్తు పంపిస్తారు. తర్వాత చెక్కు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికే వస్తుంది. మధ్యలో జోక్యాలు, ఆలస్యాలు తగ్గించడానికి ఈ విధానం తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం నుంచైనా సిఫార్సు చేసే అవకాశం ఉండేది. ఇక నుంచి వారి నియోజవకర్గానికి సంబంధించిన దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో వివరాలు పక్కాగా నమోదు చేయాలి. లేకపోతే ఆర్థిక సహాయం అందడంలో జాప్యం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి..: Laksettipet Incident | లక్షెట్టిపేటలో విషాదం.. షెడ్డు కూలి నలుగురు రైతుల మృతి

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *