Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బాగోతం.. తల్లి-కొడుకుల గలీజ్ దందా వెలుగులోకి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో సంచలనానికి గురిచేసే హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డబ్బున్న మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా (Social Media) ద్వారా వలవేసి, ప్రేమ పేరుతో నమ్మించి, అనంతరం బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటున్న తల్లి-కొడుకుల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… మియాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ బీటెక్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)ను ఆయుధంగా ఉపయోగించాడు. ఖరీదైన దుస్తులు ధరించి, లగ్జరీ హోటళ్లు, రిసార్టులు, టూర్లలో తిరుగుతున్నట్లుగా రీల్స్ రూపొందించి పోస్ట్ చేస్తూ తాను ధనికుడిగా కనిపించేలా చేసేవాడు.

Jubilee Hills Honeytrap | మైనర్ బాలిక‌లు టార్గెట్..

ఈ రీల్స్‌కు లైక్ చేసిన వారిలో ముఖ్యంగా మైనర్ బాలికలను గుర్తించి వారి వివరాలు సేకరించేవాడు. ముందుగా స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, తర్వాత ప్రేమిస్తున్నానని నమ్మించేవాడు. కొంతకాలానికి మాయమాటలు చెప్పి వారిని లోబరుచుకుని, శారీరక సంబంధాలకు ఒప్పించేవాడు. ఈ సమయంలో బాలికలకు తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసి, తరువాత వాటిని బయటపెడతానని బెదిరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా పదుల సంఖ్యలో మైనర్ బాలికలను టార్గెట్ చేసి లక్షల్లో నగదు గుంజినట్లు పోలీసులు గుర్తించారు.

Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ మైనర్ బాలిక

ఇటీవల జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ మైనర్ బాలిక కూడా ఇదే విధంగా మోసపోయింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యుల సహకారంతో బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొదట చంద్రశేఖర్ ఆజాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతడికి సహకరించిన మరో నిందితుడు రాజును కూడా అరెస్టు చేశారు. విచారణలో అర్జున్ తల్లి మీనాకుమారి సహా మరో నలుగురు ఈ దందాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు తేలడంతో వారినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలపై మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మైనర్ పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Lantern Festival హైదరాబాద్‌లో ‘థాయ్’ మాయాజాలం..మే 9న భారీ లాంతర్ల పండుగ!

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *