అక్షరటుడే, వెబ్‌డెస్క్: SRH vs PBKS | ఐపీఎల్ IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. అనూహ్య గెలుపును సొంతం చేసుకున్నారు. పంజాబ్‌పై 33 పరుగుల తేడా హైదరాబాద్ జట్టు భారీ విజయం సొంతం చేసుకుంది.
SRH vs PBKS | టాస్ గెలిచిన పంజాబ్..
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అభిషేక్ శర్మ (35), ట్రావిస్ హెడ్ (38) మెరుపుల ఆరంభాన్ని ఇచ్చారు. హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) హాఫ్ సెంచరీలతో పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. చివరగా నితీశ్ (29*) మెరుపులతో అదరగొట్టాడు.
తదుపరి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్లాసెన్ 43 బాళ్లలో 69 పరుగులు చేశాడు. కిషన్ 55(32) పరుగులు, ట్రావిస్ 38(19) పరుగులతో రాణించినా.. ఫలితం లేకుండా పోయింది.
Humanoid Robot Monk | ఆధ్యాత్మిక రంగంలోకి ఏఐ.. దక్షిణ కొరియాలో ‘రోబో సన్యాసి’ అరంగేట్రం!

