అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mohali ED Raid | పంజాబ్ (Punjab)లోని మోహాలీ వేదికగా గురువారం జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు తీవ్ర కలకలం రేపాయి. మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ అక్రమాలపై దృష్టి సారించిన అధికారులకు నిందితులు ఊహించని షాక్ ఇచ్చారు.
ఖరార్‌లోని ‘వెస్టర్న్ టవర్స్’ అపార్ట్‌మెంట్‌లో సోదాలు జరుగుతుండగా, 9వ అంతస్తులోని 906 నంబర్ ఫ్లాట్ నుంచి నిందితులు భారీగా నగదు ఉన్న బ్యాగులను కిందకు విసిరేశారు.
Mohali ED Raid | అధికారుల కళ్లు కప్పుతూ..
కింద సిద్ధంగా ఉన్న ఒక వాహనం, పైనుంచి పడ్డ నోట్ల బ్యాగులను తీసుకుని అధికారుల కళ్లు గప్పుతూ అక్కడి నుంచి వేగంగా తప్పించుకుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చండీగఢ్, మోహాలీ పరిసరాల్లోని దాదాపు 12 ప్రాంతాల్లో ఈడీ (Enforcement Directorate) బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. సన్‌టెక్ సిటీ, ఆల్టస్ బిల్డర్స్, ధిర్ కన్‌స్ట్రక్షన్, ఏబీఎస్ టౌన్‌షిప్ వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Mohali ED Raid | హవాలా మార్గాల ద్వారా..
గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA) పరిధిలో జరిగిన ‘ల్యాండ్ యూజ్ మార్పిడి’ (CLU) లైసెన్సుల కేటాయింపులో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో హవాలా మార్గాల ద్వారా నగదు చేతులు మారడం, అక్రమ నగదు చలామణి (Money Laundering) జరిగిందన్న పక్కా సమాచారంతో ఈడీ రంగంలోకి దిగింది.
అధికారుల దాడుల నుంచి తప్పించుకోవడానికి నిందితులు అవలంబించిన ఈ వినూత్న పద్ధతి పోలీసులను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈడీ అధికారులు పరారైన వాహనం కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Operation Sindoor | ఆపరేషన్ సింధూర్‌కు ఏడాది.. సోషల్ మీడియా డీపీ మార్చిన ప్రధాని మోదీ!

