CPI Letter Governor | సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాల్సిందే.. గవర్నర్‌కు సీపీఐ బహిరంగ లేఖ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CPI Letter Governor | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠపై భారత కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party) స్పందించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ వ్యవహరించాలని, మెజారిటీ పార్టీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ము. వీరపాండియన్ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

CPI Letter Governor | గవర్నర్‌కు సీపీఐ లేఖ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly elections) ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో, అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళ వెట్రి కజగం’ (TVK)కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 సీట్లు గెలుచుకుని టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందని, ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని సీపీఐ పేర్కొంది.

CPI Letter Governor | గవర్నర్ నిబంధన సరికాదని..

టీవీకే అధినేత విజయ్ (TVK Chief Vijay) ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరగా, బాధ్యతలు చేపట్టకముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ నిబంధన విధించడం సరికాదని వీరపాండియన్ అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. చారిత్రాత్మక ‘ఎస్.ఆర్. బొమ్మై’ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును సీపీఐ గుర్తు చేసింది. ఒక పార్టీకి బలం ఉందో లేదో నిర్ణయించాల్సింది అసెంబ్లీ వేదికగానే తప్ప, రాజ్‌భవన్ కార్యాలయంలో కాదని స్పష్టం చేసింది.

CPI Letter Governor | డిమాండ్..

రాజ్యాంగ సూత్రాలను , ఉన్నత న్యాయస్థానాల తీర్పులను అనుసరించి, తక్షణమే టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని సీపీఐ కోరింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ఆ పార్టీకి తగిన సమయం ఇవ్వాలని గవర్నర్‌ను అభ్యర్థించింది.

ఇది కూడా చదవండి..: Mohali ED Raid | మోహాలీ ఈడీ సోదాల్లో హైడ్రామా.. అధికారుల కళ్లుగప్పినోట్ల బ్యాగులతో పరార్!

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *