Paddy Procurement Delay| ధాన్యం తడిశాక ఎందుకొచ్చావ్? మంత్రి అడ్లూరిపై రైతుల ఫైర్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Paddy Procurement Delay| రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రైతులు అడ్డుకుని నిలదీశారు. “ధాన్యం మొత్తం వర్షానికి తడిసి ముద్దయ్యాక ఇప్పుడు ఏం చూడటానికి వచ్చారు?” అంటూ రైతులు మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Paddy Procurement Delay|15 రోజులుగా ఏం చేస్తున్నారు?

గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసి వేచి చూస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. “వారాల తరబడి ధాన్యం కొనుగోలు చేయకుండా ఏం చేశారు? వర్షం వస్తుందని ముందే తెలుసు కదా.. ఎందుకు సేకరించలేదు?” అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందే ధాన్యం తడిసిపోవడంతో తమకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులని వారు మండిపడ్డారు.

Paddy Procurement Delay|సమాధానం చెప్పలేక జారుకున్న మంత్రి ..

రైతుల నుంచి ఎదురైన ఊహించని ప్రశ్నలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రైతుల ఆగ్రహాన్ని చూసి వారికి సమాధానం చెప్పలేక, అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెబుతోంది తప్ప, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని రైతులు ఈ సందర్భంగా ఆరోపించారు.

ఇది కూడా చదవండి: TVK Vijay | విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. ఆ పార్టీల మద్దతు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *