Suvendu Adhikari CM|బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణ స్వీకారం!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Suvendu Adhikari CM|పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 207 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన బీజేపీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, శాసనసభ పక్ష నేతగా సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Suvendu Adhikari CM|అమిత్ షా సమక్షంలో కీలక నిర్ణయం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఒడిశా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత భట్టాచార్య, సువేందు అధికారి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించగా, సభ్యులందరూ దీనికి మద్దతు తెలిపారు.బెంగాల్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు ఉపముఖ్యమంత్రులను (Deputy CMs) నియమించాలని బీజేపీ నిర్ణయించింది. పరిపాలనలో సమతుల్యత,  సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Suvendu Adhikari CM|రేపు ఉదయం ప్రమాణ స్వీకారం..

శనివారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్‌లో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఎన్డీయే కూటమిలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు కీలక నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Paddy Procurement Delay| ధాన్యం తడిశాక ఎందుకొచ్చావ్? మంత్రి అడ్లూరిపై రైతుల ఫైర్

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *