Bandi Sanjay Counter | అవినీతి చేయడం మాకు తెలియదు.. కేటీఆర్‌కు బండి సంజయ్‌ కౌంటర్‌

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Counter | కేంద్ర మంత్రి బండి సంజయ్​ బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​కు కౌంటర్​ ఇచ్చారు. కేటీఆర్‌లా దోచుకోవడం తనకు తెలియదన్నారు. హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 10న హైదరాబాద్​ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్​ రోడ్స్ (RTC X Roads)​ నుంచి అంబర్​పేట వరకు బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్​ మాట్లాడుతూ.. కేటీఆర్​కు కౌంటర్​ ఇచ్చారు. ‘‘బండి సంజయ్ కేంద్ర మంత్రి ఐన రెండున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క మంచి పని అయినా చేశాడా? ఒక్క గుడి కట్టిండా? ఒక్క బడి కట్టిండా?” అని కేటీఆర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Bandi Sanjay Counter | డ్రగ్స్​ తీసుకోవడం తెలియదు

బండి సంజయ్​ మాట్లాడుతూ.. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం తనకు తెలియదన్నారు. మీలా డ్రగ్స్ తీసుకోవడం తెలియదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఈ-ఫార్ములా, విద్యుత్ కొనుగోళ్లలో.. అవినీతి చేయడం తెలియదని విమర్శించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్​ అహంకారం వల్లే KCR ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఏం చేసినా BRS మళ్లీ అధికారంలోకి రాదన్నారు.

Bandi Sanjay Counter | కేంద్రం నుంచి నిధులు

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని బండి సంజయ్​ తెలిపారు. కేంద్రం నుంచి తాము నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని ఆరోపించారు. డబుల్​ ఇంజిన్​ సర్కార్​తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కేటీఆర్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

దీనిని కూడా చదవండి : Paddy Procurement Delay| ధాన్యం తడిశాక ఎందుకొచ్చావ్? మంత్రి అడ్లూరిపై రైతుల ఫైర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *