సినిమాKing 100 Leak | నాగార్జున ‘కింగ్ 100’కు బిగ్ షాక్.. లీకైన యాక్షన్ సీన్స్...

King 100 Leak | నాగార్జున ‘కింగ్ 100’కు బిగ్ షాక్.. లీకైన యాక్షన్ సీన్స్ వైరల్!

అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘కింగ్ 100’ షూటింగ్ ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయ‌క‌ముందే లీకుల బారిన పడింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : King 100 Leak | కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన సినీ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ దశలో ఉంది.

అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, సినిమా గురించి ఏదో ఒక సమాచారం బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ టీమ్‌కు ఊహించని షాక్ తగిలింది. సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాల వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

King 100 Leak | మాస్ అవ‌తార్‌లో..

లీకైన వీడియోల్లో నాగార్జున పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఒక సీన్‌లో చేతిలో భారీ రాడ్ పట్టుకుని తన గ్యాంగ్‌తో కలిసి శత్రువులపై దాడికి వెళ్తూ “గేట్లు మూయండిరా” అంటూ డైలాగ్ చెప్పడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరో వీడియోలో జనాలతో నిండిన ప్రదేశంలో రౌడీలతో ఫైట్ చేస్తూ, ఓ యువతిని కాపాడి కారులో తీసుకెళ్తున్న సీన్ కనిపిస్తోంది. ఈ రెండు సన్నివేశాలు చూస్తుంటే సినిమా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

King 100 Leak | ఈసారి నాగ్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయం

అయితే అధికారిక అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ లీకులు షాకింగ్‌గా మారాయి. ముఖ్యమైన సన్నివేశాలు ఇలా బయటకు రావడం సినిమాపై ప్రభావం చూపుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాగార్జున వింటేజ్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. “ఈసారి నాగ్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ మైలురాయి సినిమాను నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కథపై పూర్తి నమ్మకంతో పెద్దగా అనుభవం లేని దర్శకుడు రా. కార్తీక్‌కు (Director Ra. Karthik) అవకాశం ఇచ్చారని సమాచారం. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేస్తూ, సినిమా అవుట్‌పుట్‌ను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సెట్స్ నుంచి వీడియోలు లీక్ కావడం మాత్రం టీమ్‌ను కలవరపెడుతోంది.

ఇది కూడా చదవండి..: Prabhas Spirit Look | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ గుండు లుక్?.. లీకైన ఫోటోతో సోషల్ మీడియా షేక్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Instagram Followers Drop | ఇన్​స్టాగ్రామ్​లో సంచలనం.. ఒకేరోజు కోట్లలో ఫాలోవర్లు మాయం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Instagram Followers Drop | ప్రముఖ సోషల్​మీడియా (Social...

Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్​ఫ్లూ...

Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Thalapathy Prediction | ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్​ వేణుస్వామి...

Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fishermen Compensation AP | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని...