క్రీడలుKKR Playoff Hopes | ఢిల్లీపై గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవం.. మ‌రి అక్ష‌ర్...

KKR Playoff Hopes | ఢిల్లీపై గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవం.. మ‌రి అక్ష‌ర్ సేన ప‌రిస్థితి ఏంటి?

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్ రేసులో తన అవకాశాలను మరింత బలపరుచుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KKR Playoff Hopes | ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో కీలక దశకు చేరుకున్న సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న కేకేఆర్, వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధించి తన జైత్రయాత్రను కొనసాగించింది.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలర్లు అద్భుతంగా రాణించి ఢిల్లీని తక్కువ స్కోర్‌కే పరిమితం చేయగా.. అనంతరం ఫిన్ అలెన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అషుతోష్ శర్మ 39 పరుగులతో పోరాడాడు. కానీ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.

KKR Playoff Hopes | మ‌ళ్లీ ఔట్..!

కేకేఆర్ (Kolkata Knight Riders) బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. అలాగే వైభవ్ అరోరా, సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ సాధించారు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఫిన్ అలెన్ ఒంటిచేత్తో విజయం అందించాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో అజేయ శతకం బాదిన అలెన్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని దూకుడు ముందు ఢిల్లీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మరోవైపు కామెరూన్ గ్రీన్ 33 పరుగులతో కీలక సహకారం అందించాడు. కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలోనే 147 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది. ఇంకా 34 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం ఆ జట్టు ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.

KKR Playoff Hopes | సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేయడం మ్యాచ్‌కే హైలైట్‌

ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. ఫిన్ అలెన్ సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి. ఏదైన అద్భుతం జ‌రిగితే త‌ప్ప ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కి వెళ్ల‌దు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. ఇక కేకేఆర్ మాత్రం వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. ప్ర‌స్తుతం టేబుల్ టాప్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఉండ‌గా, ఆ త‌ర్వాత స్థానాల‌లో పంజాబ్, ఆర్సీబీ, ఆర్ఆర్ జ‌ట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Prince Yadav Kohli | కోహ్లీ ఇచ్చిన స‌ల‌హా ఆయ‌న‌కే ఎఫెక్ట్ చూపించిందిగా.. ప్రిన్స్ యాదవ్ సంచలనం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Thalapathy Prediction | ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్​ వేణుస్వామి...

Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fishermen Compensation AP | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని...

King 100 Leak | నాగార్జున ‘కింగ్ 100’కు బిగ్ షాక్.. లీకైన యాక్షన్ సీన్స్ వైరల్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : King 100 Leak | కింగ్ అక్కినేని...

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...