జాతీయంVijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్...

Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్​ వేణుస్వామి విజయ్​ దళపతి గురించి చెప్పిన జోస్యం హాట్​ టాపిక్​గా మారింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Thalapathy Prediction | ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్​ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖుల జాతకాలు చెబుతుంటారు. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజమైన విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన విజయ్​ దళపతి గురించి చెప్పిన జోస్యం హాట్​ టాపిక్​గా మారింది.

విజయ్ దళపతి ప్రస్తుతం దేశంలో సంచలనం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) ఆయన పార్టీ టీవీకే అనూహ్యంగా 108 స్థానాల్లో గెలుపొందింది. అయితే అధికారానికి పది సీట్ల దూరంలో ఆగిపోయారు. అయితే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..? విజయ్ సీఎం అవుతారా..? అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

Vijay Thalapathy Prediction | విజయ్ సీఎం అయినా కూడా

తమిళనాడు (Tamil Nadu)లో విజయ్​ ప్రభుత్వం ఏర్పడినా ఎక్కువకాలం నిలవదని, మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తమిళ రాజకీయాల్లో అస్థిరత తప్పదని పేర్కొన్నారు. విజయ్ జాతకంతో పాటు తమిళనాడు రాష్ట్ర జాతకాన్ని కలిపి పరిశీలిస్తే.. ఒకవేళ విజయ్ సీఎం అయినా కూడా ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగబోదన్నారు. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నెలలోనా, ఆరు నెలల్లోనా, లేదా ఏడాదిలోపునా రాజకీయ సంక్షోభం రావచ్చని వేణుస్వామి తెలిపారు. కానీ మళ్లీ ఎన్నికలు మాత్రం కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన జోస్యం హాట్​ టాపిక్​గా మారింది.

Vijay Thalapathy Prediction | హీరోయిన్ త్రిష పేరు ప్రస్తావన..

వేణుస్వామి తమన విశ్లేషణలో మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. విజయ్ – త్రిష కాంబినేషన్‌ను ఆయన “ఏకనాడి కాంబినేషన్”గా అభివర్ణించారు. త్రిష ప్రభావం పోయి ఉన్నట్లయితే విజయ్ ఎన్నికల ఫలితం మరోలా ఉండేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి.

Vijay Thalapathy Prediction | బెంగాల్​లోనూ రాష్ట్రపతి పాలన..!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైనా వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా.. భవిష్యత్తులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మమతా బెనర్జీ (Mamata Banerjee) జాతకంలో మాత్ర తిరిగి సీఎం అయ్యే యోగం కనిపించడం లేదని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Tanker Blast | గ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంకర్.. మూడు కార్లు, బైక్​ దగ్ధం..

అక్షరటుడే, కామారెడ్డి: Car Tanker Blast | కార్లలో దొంగచాటుగా గ్యాస్​...

Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

అక్షరటుడే వెబ్‌డెస్క్: Biscuit Baba | ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ...

Electric Shock Death | పిండిగిర్ని శుభ్రం చేస్తుండగా విద్యుత్​షాక్​.. మహిళ మృతి

అక్షరటుడే, కామారెడ్డి: Electric Shock Death | రుణం తీసుకుని ఉపాధి...

Nara Lokesh Durga | ఇంద్రకీలాద్రిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు

అక్షరటుడే వెబ్‌డెస్క్ : Nara Lokesh Durga | ఆంధ్రప్రదేశ్ ఐటీ,...