నిజామాబాద్Migrant Worker Verification | ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో జాగ్రత్త:...

Migrant Worker Verification | ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో జాగ్రత్త: సీపీ

ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ మేరకు శనివారం సీపీ ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Migrant Worker Verification | ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitany) సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు లేదా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వారి పట్ల ఇంటి ఓనర్లు, దుకాణాల యజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శనివారం సీపీ (Nizamabad Police) ప్రకటన విడుదల చేశారు.

Migrant Worker Verification | వారి పూర్తివివరాలు తెలుసుకున్నాకే..

ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు ప్రతులు, మొబైల్ నంబర్లు, కుటుంబ వివరాలు, పనిచేసే స్థలం, వచ్చిన తేదీ వంటి పూర్తివివరాలు తీసుకున్నాకే వారిని పనిలో పెట్టుకోవాలని సీపీ (Police Advisory) సూచించారు. అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసించే వారు, నిర్మాణ పనుల్లో పనిచేసే కార్మికులు, హోటళ్లు, లాడ్జీలు, పరిశ్రమలు ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేసే వారి వివరాలను యాజమాన్యాలు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వారి ప్రవర్తనలో మార్పులు గమనించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల అప్రమత్తతతోనే నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడడం సులభమవుతుందని తెలిపారు. ప్రతిఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి సమాజ భద్రతకు తోడ్పడాలన్నారు.

ఇది కూడా చదవండి: TVK Vijay | విజయ్‌కి సీఎం కుర్చీ దక్కినా.. ముందున్నది ముళ్లబాటేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Youth Congress Presidents | కష్టపడ్డ కార్యకర్తలకు దక్కిన ఫలితం.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Presidents | కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని...

India MIRV Missile|ఒకే క్షిపణి.. ఎన్నో లక్ష్యాలు.. రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India MIRV Missile|భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. అణ్వస్త్ర...

TamilNadu Politics | సస్పెన్షన్​ థ్రిలర్​లా ట్విస్టులు.. ఎట్టకేలకు విజయ్‌కి గవర్నర్ అపాయింట్‌మెంట్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TamilNadu Politics | తమిళ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి....

Anil Ambani CBI|అనిల్ అంబానీకి షాక్.. ఏడీఏ గ్రూప్ కంపెనీలపై సీబీఐ సోదాలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Anil Ambani CBI|ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ (ADAG)...