Theft Attempt Kamareddy | మద్యం మత్తులో చోరీకి యత్నం.. దొంగలకు దేహశుద్ధి

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Theft Attempt Kamareddy | కామారెడ్డి పట్టణంలో(Kamareddy City) దొంగలు హల్​చల్​ సృష్టిస్తున్నారు. పలు చోట్ల చోరీలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. కాగా మద్యం మత్తులో ఇద్దరు దొంగలు శనివారం పట్టణంలో చోరీకి యత్నించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Theft Attempt Kamareddy | ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా..

స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఫుల్​గా మద్యం(Drunk Thieves) సేవించారు. మద్యం మత్తులో జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో చోరీ చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి యజమాని వారిని గమనించి భయంతో కేకలు వేశారు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు(Kamareddy Police) అప్పగించారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *