Gujarat ship attack | హోర్ముజ్ జలసంధిలో రక్తపాతం.. గుజరాత్​ నౌకపై దాడి.. భారతీయ నావికుడి దుర్మరణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gujarat ship attack | హోర్ముజ్ జలసంధిలో గుజరాత్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు జరిపిన దాడిలో, గుజరాత్‌కు చెందిన నావికుడు అల్తాఫ్ తలాబ్ కెర్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదం నుంచి 17 మంది నావికులు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఇప్పటికీ గల్ఫ్ ప్రాంతంలోని వివిధ నౌకల్లో 1,100 మందికి పైగా భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

Gujarat ship attack | భారత్ ఎందుకు లక్ష్యం?

ఈ యుద్ధ ఉద్రిక్తతల మధ్య అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఇతర దేశాల నౌకల పరిస్థితిని పరిశీలిస్తే.. చైనా నౌకలు సురక్షితం. పాకిస్థాన్ నౌకలకు ఎలాంటి ఆటంకం లేదు. బంగ్లాదేశ్ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.

కానీ, భారతీయ నౌకలు, భారతీయ నావికులే లక్ష్యంగా దాడులు జరుగుతుండటం గమనార్హం. గతంలో హౌతీ రెబల్స్ సైతం భారతీయ నౌకలనే ముందుగా లక్ష్యం చేసుకున్నాయి.

Hormuz Strait Attack | హార్ముజ్ జలసంధి జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్ దాడులను తిప్పికొట్టామని ట్రంప్ వ్యాఖ్య

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *