అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reduce Cooking Oil | ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు వినూత్నమైన ఆహ్వానం ఇచ్చారు. ఇంట్లో వంట నూనె వినియోగాన్ని ప్రతి నెల 10 శాతం తగ్గించాలని మోడీ సూచించారు.
Reduce Cooking Oil | దేహ సేవతోపాటు దేశ సేవ
“వంట వినియోగం తగ్గించండి.. తద్వారా దేహ సేవతోపాటు దేశ సేవ కూడా చేసినవారు అవుతారు..” అని మోడీ అన్నారు. అంటే, తక్కువ నూనె వినియోగించడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం మెరుగవుతుంది.
దీనికితోడు దేశ వనరుల పరిరక్షణకు సహకారం అందించినవారు అవుతారని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడానికి, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి ఈ మాట చెబుతున్నట్లు తెలిపారు.
ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వనరులను తక్కువ వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని అన్నారు.

