సినిమాDhurandhar 2 Box Office | బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ‘ధురంధర్ ది రివెంజ్’ దూకుడు,...

Dhurandhar 2 Box Office | బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ‘ధురంధర్ ది రివెంజ్’ దూకుడు, పుష్ప 2 రికార్డ్ బ్రేక్

భారీ వీఎఫ్ఎక్స్ లేకుండానే స్పై డ్రామాగా వచ్చిన ‘ధురంధర్ ది రివెంజ్’ రూ.1743 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ‘పుష్ప 2’ రికార్డులను దాటేసి, ఇండియన్ టాప్-3 గ్రాసర్స్ జాబితాలో స్థానం సంపాదించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dhurandhar 2 Box Office | ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల పర్వం కొత్త మలుపు తిరిగింది. గతేడాది సంచలనం సృష్టించిన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ ‘ధురంధర్ ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1743 కోట్ల వసూళ్లు సాధించి, ఇండియన్ సినీ చరిత్రలో టాప్-3 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో స్థానం సంపాదించింది.ప్రస్తుతం బాహుబలి 2 రూ.1789 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, దంగల్ రూ.2070 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్’ కూడా ఈ జాబితాలోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Dhurandhar 2 Box Office | ధురంధ‌ర్ 2 ర్యాంపేజ్…

ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే… దాదాపు నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం. సాధారణంగా భారీ బడ్జెట్, ఫాంటసీ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారంగా సినిమాలు విజయం సాధిస్తుంటాయి. కానీ ‘ధురంధర్’ మాత్రం పూర్తిగా కంటెంట్, కథనం, టెన్షన్‌తో నిండిన స్పై డ్రామాగా రూపొంది విజయం సాధించడం విశేషం. స్పై యాక్షన్ సినిమాలకు భిన్నంగా, కొత్త తరహా మేకింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇతర స్పై థ్రిల్లర్ సినిమాలు (Spy Thriller Movies) కూడా తమ స్క్రిప్ట్‌లను పునఃపరిశీలిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే, ఈ సినిమా ప్రభావం ఇండస్ట్రీపై గట్టిగా పడినట్లు స్పష్టమవుతోంది.

 Dhurandhar 2 Box Office | రూ.2000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా లేదా?

ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. ‘ధురంధర్ ది రివెంజ్’ రూ.2000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా లేదా? అని. అయితే, కొన్ని సవాళ్లు కూడా ఈ చిత్రానికి ఎదురవుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ వంటి దేశాల్లో ఈ సినిమాపై నిషేధం ఉండటం, అలాగే చైనా, జపాన్ Japan మార్కెట్లలో స్పై డ్రామాలకు పరిమిత ఆదరణ ఉండటం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త కష్టసాధ్యంగా కనిపిస్తోంది. అయినా, ఇప్పటికే సాధించిన కలెక్షన్లు చూసుకుంటే ఈ చిత్రం మరోకొన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘ధురంధర్ ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి.

ఇది కూడా చదవండి..: Rashmika Mysaa Movie | ‘మైసా’ కోసం రష్మిక కఠిన శిక్షణ.. యాక్షన్ అవతార్‌లో నేషనల్ క్రష్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...