అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పరారీలో ఉన్నట్లు సిట్ అధికారి రితిరాజ్ (DCP Rithiraj) తెలిపారు. అతడిపై నమోదైన పోక్స్ కేసు విచారణకు ప్రభుత్వం ఆమెను ప్రత్యేకాధికారిగా నియమించిన విషయం తెలిసిందే.
బండి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు (POCSO Case) నమోదు అయిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఠాణాకు వచ్చారు. SHO క్యాబిన్‌లో ఆమె మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Bandi Bhagirath Case | చర్యలు తీసుకుంటాం
బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని రితిరాజ్ తెలిపారు. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. అతని CDR పరిశీలిస్తుస్తున్నామని, ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. అవసరం అయితే మరోసారి ఆమెతో మాట్లాడుతామని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Women Commission | తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు

