బిజినెస్​May 12 Gold Rates | బంగారం, వెండి ధ‌ర‌ల ఊగిసలాట.. Modi వ్యాఖ్యల ప్రభావమా..?

May 12 Gold Rates | బంగారం, వెండి ధ‌ర‌ల ఊగిసలాట.. Modi వ్యాఖ్యల ప్రభావమా..?

అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, రూపాయి మారకం విలువలో మార్పులు, దేశీయ పెట్టుబడిదారుల భావోద్వేగాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యల తర్వాత గోల్డ్ షేర్లు భారీగా పడిపోవడంతో మార్కెట్‌లో కొత్త చర్చ మొదలైంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 12 Gold Rates | దేశీయ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు Gold Rates మరోసారి స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,52,120 వద్ద కొనసాగుతుండగా, నిన్నటి ధర రూ.1,52,234గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,440 వద్ద ట్రేడవుతుండగా, నిన్న ఇది రూ.1,39,640గా ఉంది. వెండి ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో రూ.2,74,800 వద్ద కొనసాగుతోంది.

ఇటీవల హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ “బంగారం కొనొద్దు” అంటూ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతి రోజే గోల్డ్‌కు సంబంధించిన షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మరింత మార్పులు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

May 12 Gold Rates | దేశంలోని ప్రధాన నగరాల్లో ధ‌ర‌లు..

హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,120గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా ఉంది. వెండి కిలో ధర రూ.2,85,100గా నమోదైంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,120 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా ఉంది.

బెంగళూరులో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,52,120, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,440గా ట్రేడవుతోంది. కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,120 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,440గా నమోదైంది.

చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,990గా కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,270గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,590 వద్ద ట్రేడవుతోంది.

May 12 Gold Rates | Silver Rates

వెండి ధరల Silver Rates విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,74,800గా ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం ఇది రూ.2,85,100 వరకు ఉంది. మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

May 12 Market Analysis | నెగెటివ్​గా గిఫ్ట్ నిఫ్టీ.. నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Meeting | 21న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ...

Tamil Nadu CM Vijay | తమిళనాడు సీఎం విజయ్​ సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu CM Vijay | తమిళనాడు...

AIADMK Split | బిగ్ బ్రేకింగ్‌: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌కు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Split | తమిళనాడు రాజకీయాల్లో కీలక...

Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Street Dog Attack | హైదరాబాద్​ (Hyderabad)లో...