Bandi Bhagirath Bail | కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్​ కుమారుడు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Bhagirath Bail | కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Bandi Bhagirath Bail | వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్..

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో, భగీరథ్ తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ (Vacation Bench) ముందు దాఖలు చేశారు. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని వారు కోరారు.

Bandi Bhagirath Bail| 14న విచారణ..

హైకోర్టు వెకేషన్ బెంచ్ మే 14న (గురువారం) ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనుంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసు కావడంతో, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక వివాదానికి సంబంధించి బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో చట్టపరమైన ఊరట పొందాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ఈ కేసును సిట్​ విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్​ కుమారుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేయడం గమనార్హం.

 

 

ఇది కూడా చదవండి: India Toy Industry | ప్రపంచానికి ‘బొమ్మ’ చూపిస్తున్న భారత్.. ఆత్మనిర్భరత దిశగా ముందడుగు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *