అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | అమెరికా -ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ముడిచమురు ధరలకు కళ్లెం పడడం లేదు. ఇరుపక్షాలు శాంతి ఒప్పదానికి రాకపోవడంతో ఇన్వెస్టర్లలో భయాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ప్రధాని మోదీ (Prime Minister Modi) పొదుపు చర్యలు ప్రకటన, గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండడం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగిస్తుండడం, రూపాయి బలహీనత కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. దీంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది.
Stock Market Losses | రోజంతా నష్టాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఉదయం సెన్సెక్స్ 327 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 53 పాయింట్లు పెరిగింది. అయితే అమ్మకాల ఒత్తిడితో 1,292 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 35 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 409 పాయింట్లు క్షీణించింది. చివరికి సెన్సెక్స్ 1,456 పాయింట్ల నష్టంతో 74,559 వద్ద, నిఫ్టీ 436 పాయింట్ల నష్టంతో 23,379 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Losses | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి
అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ (Nifty) రియాలిటీ ఇండెక్స్ 4.11 శాతం, ఐటీ ఇండెక్స్ 3.73 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.35 శాతం, యుటిలిటీ 2.94 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.85 శాతం, మీడియా 2.77 శాతం, పవర్ 2.61 శాతం, ఆటో 2.28 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.14 శాతం నష్టాలతో ముగిశాయి.
Stock Market Losses అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 869 కంపెనీలు లాభపడగా 3,412 స్టాక్స్ నష్టపోయాయి. 129 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 93 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 45 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 11 ýక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.
Stock Market Losses | ఒకే ఒక్కటి..
బీఎస్ ఈ సెన్సెక్స్‌లో ఒకే ఒక్క స్టాక్ లాభపడగా.. 29 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎస్ బీఐ 0.12 శాతం పెరిగింది.
టెక్ మహీంద్రా 4.44 శాతం, అదానీపోర్ట్స్ 4.39 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.11 శాతం, టీసీఎస్ 3.84 శాతం, టైటాన్ 3.60 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

