Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

ONGC Share Price | రాయల్టీ రేట్ తగ్గించిన కేంద్రం.. పరుగులు తీసిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు

shashi kiran Mottala
Last updated: May 12, 2026, 5:18 pm 5:18 pm
Shashi kiran Mottala
Share
ONGC Share Price

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ONGC Share Price |భారతదేశంలో అప్‌స్ట్రీమ్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిపై రాయల్టీ రేట్లను తగ్గించింది. భారతదేశంలో అప్‌స్ట్రీమ్ అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడం, చమురు, గ్యాస్ రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యాలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు మంగళవారం భారీగా పెరిగాయి. ఓఎన్జీసీ షేరు ధర క్రితం ముగింపు రూ. 281తో పోలిస్తే ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 19.90 పెరిగింది. చివరికి 4.80 శాతం లాభంతో రూ. 294.50 వద్ద స్థిరపడింది. ఆయిల్ ఇండియా షేరు ధర మంగళవారం ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 43.40 పెరిగి ఇంట్రాడేలో రూ. 499.40ని టచ్ చేసింది. చివరికి 7.66 శాతం లాభంతో రూ. 490.95 వద్ద ముగిసింది.

ONGC Share Price | రాయల్టీ లెక్కలు ఇలా..

దేశవ్యాప్తంగా ఉన్న సహజ వనరుల నుంచి చమురు, గ్యాస్‌ను బయటకు తీసినందుకు ఆయా కంపెనీలు ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తీర ప్రాంతాల్లో ముడి చమురు ఉత్పత్తిపై 16.66 శాతంగా ఉన్న రాయల్టీని కేంద్రం 10 శాతానికి తగ్గించింది. సముద్ర గర్భంలో చేసే ఉత్పత్తిపై 9.09 శాతంనుంచి 8 శాతానికి తగ్గింది. దీనివల్ల కంపెనీ ఖర్చులు తగ్గి, నికర లాభాలు పెరుగనున్నాయి. ఈ మార్పులు అప్‌స్ట్రీమ్ కంపెనీల లాభాలను, నగదు ప్రవాహాన్ని గణనీయంగా పెంచుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం రాయల్టీ తగ్గించిన తర్వాత ఆయా కంపెనీల షేర్ల టార్గెట్‌ను బ్రోకరేజీ సంస్థలు పెంచాయి. దీంతో రెండు కంపెనీలూ ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | నాలుగో రోజూ నష్టాల్లోనే.. రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి

TAGGED:Central GovernmentCrude Oil NewsEnergy StocksGovernment PolicyNatural GasOil India SharesONGC Share PriceRoyalty Rate Cutstock market India
shashi kiran Mottala
ByShashi kiran Mottala
Follow:
తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bandi Sanjay Protest Bandi Sanjay Protest | కామారెడ్డిలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
Next Article Kamareddy Murder Case | Kamareddy District Court | గంధపు చెట్లపై ఆశతో భూ యజమాని హత్య.. కౌలురైతుకు జీవిత ఖైదు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

April 28 Gold Prices
బిజినెస్​

April 21 Gold rates | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. అక్షయ తృతీయ కొనుగోళ్ల తర్వాత మార్కెట్‌లో ఊగిసలాట

By Naresh Chandan
Stock Market Gains
బిజినెస్​

Stock Market Gains | లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

By Srinivas Kolluri
akshara today .jpggold 0
బిజినెస్​

May 17 Gold Rates | కొనుగోలుదారులకు ఊరట.. తగ్గుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు

By Naresh Chandan
Stock Market Crash
బిజినెస్​

Stock Market Crash | ఆర్థిక సంక్షోభ భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు..

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.