Kamareddy District Court | గంధపు చెట్లపై ఆశతో భూ యజమాని హత్య.. కౌలురైతుకు జీవిత ఖైదు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy District Court | ఆస్తిపై ఆశతో కౌలు రైతు భూ యజమానిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో భిక్కనూరు(Bhikkanoor) పోలీసుల దర్యాప్తుతో నిందితుడికి జీవిత ఖైదు పడింది.

Kamareddy District Court | మద్యం తాగించి..

కాట్రియాల్ గ్రామానికి చెందిన కోరే సాయి జగదీష్ ముంబయిలో(Mumbai) ఉంటున్నాడు. అన్న కూతురు పెళ్లి కోసం సొంతూరు వచ్చి తన 2 ఎకరాల భూమి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ భూమిని పదేళ్లుగా కౌలుకు తీసుకుని గంధపు చెట్లు పెంచుతున్న కుర్మ సాయిలు అడ్డుపడ్డాడు. భూమి అమ్మితే భవిష్యత్తులో వచ్చే లాభం పోతుందని భావించిన సాయిలు పథకం ప్రకారం జగదీష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2022 నవంబర్ 13న మందు తాగుదామని నమ్మించి బైక్‌పై లక్ష్మాపూర్, భిక్కనూర్​ తీసుకెళ్లాడు. మద్యం తాగిన తర్వాత రాత్రి ఎర్రగట్టు అటవీ ప్రాంతంలో మత్తులో ఉన్న జగదీష్ తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహంపై దుస్తులు వేసి, మద్యం పోసి నిప్పంటించాడు.

Kamareddy District Court | జగదీష్​​ అన్న ఫిర్యాదుతో వెలుగులోకి..

జగదీష్ అన్న కాసు యాదగిరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన భిక్కనూరు పోలీసులు (Bhikkanoor Police) దర్యాప్తు చేపట్టారు. సరైన సాక్ష్యాలు సేకరించి నిందితుడు కుర్మ సాయిలును అరెస్ట్ చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్షులు, వాంగ్మూలం, ఆధారాలను పరిశీలించిన కామారెడ్డి(Kamareddy) జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ నిందితుడు కుర్మ సాయిలుకు జీవిత ఖైదుతో పాటు రూ.15 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. వ్యక్తిగత గొడవలు, ఆస్తి తగాదాల కారణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసు దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.

ఇది కూడా చదవండి:ONGC Share Price | రాయల్టీ రేట్ తగ్గించిన కేంద్రం.. పరుగులు తీసిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *