ఆంధ్రప్రదేశ్​AP Local Body Elections | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌కు...

AP Local Body Elections | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌కు ఎస్‌ఈసీ ప్లాన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Local Body Elections | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ఎస్‌ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.

సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి, కొత్త ఏడాదిలో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర‌ అమరావతిలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరయ్యారు.

AP Local Body Elections | జూన్‌లో ప్ర‌భుత్వానికి నివేదిక‌..

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ జూన్ 26 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఈ దశ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల (BC Reservations) ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ కూడా తన పనిని వేగవంతం చేసింది. ఈ కమిషన్ జూన్ నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశముందని సమాచారం. ఆ నివేదిక ఆధారంగా జులైలో రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేయనున్నారు.

AP Local Body Elections | కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికలు

మరోవైపు ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాల కూడా దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 13,291 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రచురించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన సవరణల అనంతరం తుది జాబితాలను ఖరారు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రాజకీయంగా కూడా కీలకంగా మారనున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే తొలి భారీ స్థానిక ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. గ్రామ, పట్టణ స్థాయిలో ఈ ఎన్నికలు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Srivani Tickets Scam | శ్రీవారి టికెట్ల హైజాక్.. సాఫ్ట్‌వేర్ వాడి అక్రమార్కుల దోపిడీ!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mopal Police Station | శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం..

అక్షరటుడే, డిచ్​పల్లి: Mopal Police Station | సమాజంలో శాంతి భద్రతల...

Rice Mill Inspection | రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Rice Mill Inspection | అకాలవర్షాల నేపథ్యంలో...

Vijay OSD | వెనక్కి తగ్గిన విజయ్​.. ఓఎస్​డీ నియామకం రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay OSD | తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్​...

BJP Leader Rally | ప్రధాని మాట పట్టించుకోని బీజేపీ నేత.. 50 కార్లతో ర్యాలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Leader Rally | పెట్రోల్​, డీజిల్​...