అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay OSD | తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamilnadu CM Joseph Vijay) వెనక్కి తగ్గారు. ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేశారు. ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలు, అసెంబ్లీలో నిరసనల నేపథ్యంలో జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి ఓఎస్డీ (రాజకీయ)గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) ఉపసంహరించుకుంది.
ముఖ్యమంత్రి విజయ్‌కు (OSD)గా జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివెల్ నియమించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు విజయ్ తీరుపై మండిపడ్డారు. ఓ జోతిష్యుడిని ఓఎస్డీగా నియమించి, కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. మరోవైపు బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్షాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో బుధవారం సభ ముగియగానే విజయ్ ప్రభుత్వం ఓఎస్డీ ఆయన నియామకాన్ని రద్దు చేసింది.
Vijay OSD | రాజకీయ నాయకులకు సలహాలు
వెట్రివేల్ తమిళనాడులో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారుడిగా పరిగణించబడతారు. గత కొన్నేళ్లుగా పలువురు ప్రభావవంతమైన రాజకీయ నాయకులు ఆయన సలహాలను తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ పరిశీలకులు తరచుగా ఆయనను మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితతో ముడిపెడుతూ ఉంటారు. ఆమె ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునే ముందు ఆయనను సంప్రదించేవారని కూడా వారు చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ముందే వెట్రివేల్ విజయ్ ఎన్నికల విజయాన్ని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయనను విజయ్ ఓఎస్డీగా నియమించారు. విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వును రద్దు చేశారు.
ఇది కూడా చదవండి..: BJP Leader Rally | ప్రధాని మాట పట్టించుకోని బీజేపీ నేత.. 50 కార్లతో ర్యాలీ

