అక్షరటుడే వెబ్‌డెస్క్:Jogipet Diesel Theft|సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. జన సంచారం లేని సమయం చూసి వాహనాల నుంచి డీజిల్‌ను మాయం చేశారు. కారులో వచ్చి నిమిషాల వ్యవధిలోనే ఈ దోపిడీలు ముగించడం గమనార్హం.
Jogipet Diesel Theft|వరుస దోపిడీలు..
సోమవారం అర్ధరాత్రి సమయంలో స్థానిక ఒక ప్రైవేట్ స్కూల్ ఆవరణలోకి చొరబడిన దొంగలు, అక్కడ పార్క్ చేసి ఉన్న బస్సుల నుంచి సుమారు 50 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. మరుసటి రోజు ఉదయం స్కూల్ యాజమాన్యం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. అదే రాత్రి మరో ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న లారీని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ట్యాంక్ నుంచి 100 లీటర్ల డీజిల్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లింది.
Jogipet Diesel Theft|పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాలు..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. దొంగలు వాడిన కారు నంబర్ ప్లేట్‌ను తనిఖీ చేయగా, అది ఒక ఆటోకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. నిందితులు దొంగతనం కోసం వాడుతున్న కారు కూడా మరెక్కడో చోరీ చేసిందే అయ్యింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు చెడ్డి గ్యాంగ్ తరహాలో డీజిల్ దోపిడీలకు పాల్పడటం పట్ల వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి ఈ ‘డీజిల్ దొంగల’ ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చెడ్డి గ్యాంగ్ కలకలం
ప్రయివేట్ స్కూల్ బస్సుల్లో నుంచి 50 లీటర్లు, మరో చోట లారీ నుంచి 100 లీటర్ల డీజిల్ చోరీ చేసిన గ్యాంగ్
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన
స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం
కారులో వచ్చి డీజిల్ చోరీ చేస్తున్న చెడ్డి… pic.twitter.com/0gBuNE9vvW
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 13, 2026
ఇది కూడా చదవండి: Kavitha Demands Lookout Notice| బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

