అక్షరటుడే వెబ్‌డెస్క్:Amaravati Development|అమరావతి అభివృద్ధి , రాష్ట్ర భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిడమర్రులో కిమ్స్ (KIMS) ఆస్పత్రి, బైసర్ స్కిల్ యూనివర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
Amaravati Development|బంగారం కొనుగోళ్లు తగ్గించండి..
ప్రజలు విలాసాలకు ప్రాధాన్యత తగ్గించి, పొదుపుపై దృష్టి సారించాలని సీఎం పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలను అందరూ పాటించాలని కోరారు. ఆడంబరాల కంటే భద్రత అర్థవంతంగా ఉండాలని, ప్రస్తుతం కాన్వాయ్‌లు ఒక ఫ్యాషన్‌గా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
Amaravati Development|కర్నూలు నుంచి 50 శాతం బంగారం ఉత్పత్తి..
రాష్ట్ర అభివృద్ధిలో కర్నూలు జిల్లా కీలక పాత్ర పోషించబోతోందని సీఎం వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో సుమారు 50 శాతం వాటా ఒక్క కర్నూలు జిల్లా నుంచే వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ఉద్యోగులు, ఐటీ నిపుణుల కోసం సీఎం ఒక కీలక ప్రకటన చేశారు. గతంలోనే తాను ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ గురించి చెప్పానని, ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ వస్తోందని ఆయన గుర్తు చేశారు. దీనిపై రేపో ఎల్లుండో ప్రభుత్వం తరఫున ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని స్పష్టం చేశారు.
Amaravati Development|మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని..
తొలిసారి తాను సీఎం అయినప్పుడు హైదరాబాద్‌లో కనీస వైద్య సదుపాయాలు ఉండేవని కాదని, కానీ గల్ఫ్ దేశాల తరహాలో సంస్కరణలు తెచ్చి దాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అమరావతిని అంతకంటే మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని, పారిశ్రామికవేత్తలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Amaravati Development|లక్ష ఉద్యోగాల లక్ష్యం..
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యమని సీఎం తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిని 2027 మే 13 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, దానికి అవసరమైన అనుమతులు ప్రభుత్వం త్వరగా ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి: Gold Price Hike | సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి..ఒకేరోజు రూ.వేలల్లో పెరుగుదల

