Gold ETF Surge | సుంకాల ప్రభావం.. భారీగా పెరిగిన ఈటీఎఫ్ లు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gold ETF Surge | ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బంగారం దిగుమతులను తగ్గించేందుకు సుంకాలను భారీగా పెంచింది. బంగారం, వెండి వంటి లోహాలపై దిగుమతి సుంకాలు 6 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయి. దీంతో ఆయా లోహాల ధరలకు రెక్కలొచ్చాయి.

Gold ETF Surge | రూ. 9 వేలు పెరిగిన బంగారం..

హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) రూ. 1.65 లక్షలు దాటింది. ఒక్కరోజే రూ. 9 వేలు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో స్వచ్ఛమైన కిలో వెండి ధర రూ. 2.95 లక్షలు దాటింది. ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల ధర (జూన్ డెలివరీ) 6 శాతం పెరిగి రూ. 1,62,648 లకు, సిల్వర్ ఫ్యూచర్స్‌లో కేజీ ధర (జూలై డెలివరీ) 6 శాతం పెరిగి రూ. 2.95 లక్షలకు చేరాయి.

Gold ETF Surge | ఈటీఎఫ్ లదీ అదే దారి..

దిగుమతి సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్‌ (Stock Market)లోని గోల్డ్ ఈటీఎఫ్‌లపై స్పష్టంగా కనిపించింది. క్వాంటమ్ గోల్డ్ ఫండ్ ధర 15 శాతం పెరిగి ఇంట్రాడేలో రూ. 143.37ను తాకింది. టాటా గోల్డ్ ఈటీఎఫ్ 12 శాతం, జెరోదా గోల్డ్ ఈటీఎఫ్ 9 శాతం మేర పెరిగాయి. సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా పరుగులు తీశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్‌లు 10 శాతం మేర లాభపడ్డాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *