నిజామాబాద్Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్​ తరాలకు పెట్టుబడి లాంటిది:...

Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్​ తరాలకు పెట్టుబడి లాంటిది: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

విద్యారంగంపై ప్రభుత్వం పెడుతున్నది ఖర్చు కాదని.. భవిష్యత్తు తరాలకు పెట్టుబడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్​పల్లిలో విద్యావారోత్సవాలను ప్రారంభించారు.

అక్షరటుడే, డిచ్​పల్లి: Mla Bhupathi reddy | విద్యారంగంపై ప్రభుత్వం పెడుతున్నది ఖర్చు కాదని.. భవిష్యత్తు తరాలకు పెట్టుబడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA bhupathi reddy) అన్నారు. గ్రామస్థాయిలో విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ బడుల అభివృద్ధిలో సర్పంచులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిచ్​పల్లిలో(Dichpally) విద్యావారోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు.

Mla Bhupathi reddy | పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా..

తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) నేతృత్వంలో ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డిచ్​పల్లిలో పెద్దఎత్తున వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో(Telangana University) ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలతో పాటు రూ. 200 కోట్లతో మల్కాపూర్​లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

Mla Bhupathi reddy | త్వరలోనే ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​..

త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated School) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్​లో కల్పిస్తున్న సౌకర్యాలను తదితర అంశాలపై ఎమ్మెల్యే ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంఈవోలు నరేష్, సాయిలు, గాయత్రి, రమేష్, శ్రీనివాస్, రాములు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, సర్పంచ్ ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, ఆయా మండలాల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మోహన్, జలంధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, నాయకులు రాంచందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ACB Raids Shamshabad | ఏసీబీ దాడులు.. డబ్బులు విసిరేసిన ఆర్​ఐ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

AIADMK Rebel MLAs | విజయ్​కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే షాక్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AIADMK Rebel MLAs | తమిళనాడులో రాజకీయాలు...

Kerala CM Suspense | కేరళం సీఎంపై వీడని సస్పెన్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala CM Suspense | కేరళంలో కాంగ్రెస్​...

ACB Raids Shamshabad | ఏసీబీ దాడులు.. డబ్బులు విసిరేసిన ఆర్​ఐ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids Shamshabad | రాష్ట్రంలో అవినీతి...