బిజినెస్​Gold price forecast | బంగారం ధర మళ్లీ రూ.1.85 లక్షలకు చేరుతుందా!

Gold price forecast | బంగారం ధర మళ్లీ రూ.1.85 లక్షలకు చేరుతుందా!

బంగారం ధరలు ఈ ఏడాది భారీగా పెరుగుతాయని యాక్సిస్​ డైరెక్ట్ నివేదిక అంచనా వేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold price forecast | బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయని యాక్సిస్​ డైరెక్ట్ (Axis Direct) నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి పది గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్​ రూ.1.85 లక్షలకు చేరుతుందని పేర్కొంది. గతేడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60శాతం పెరిగాయని వెల్లడించింది.

ఈ ఏడాది బలమైన డిమాండ్, స్థిరమైన ఆర్థిక దృక్పథంపై ఆధారపడి బంగారం ధరలు ఉన్నాయి. జనవరిలో జీవితకాల గరిష్టానికి చేరిన బంగారం ధరలు ఇటీవల భారీగా పడిపోయాయి. రూ.1.80 లక్షల నుంచి రూ.1.38 లక్షలకు దిగి వచ్చాయి. అనంతరం మళ్లీ పెరిగి ప్రస్తుతం రూ.1.50 లక్షల వద్ద ధరలు కదలాడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు (Tensions in West Asia), ముడి చమురు ధరలు పెరగడంతో బంగారం ధరలు దిగి వచ్చాయి. అయితే రానున్న రోజుల్లో మళ్లీ రేట్లు పెరుగుతాయని యాక్సిస్​ డైరెక్ట్ పేర్కొంది.

Gold price forecast | 15 శాతం పెరుగుదల

బంగారం ధరలు 10 నుంచి 15 శాతం పెరుగుతాయని తెలిపింది. దేశీయంగా 10 గ్రాములకు రూ.1,70 లక్షల నుంచి రూ.1.85 లక్షలకు చేరే ఛాన్స్​ ఉందని అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ విధానాలు, భౌగోళిక-రాజకీయ సంఘటనలు ధరలను ప్రభావితం చేస్తాయని తెలిపింది.

Gold price forecast | 18 శాతం రిటర్న్స్​

బంగారం ధరలు 2016 నుంచి 2026 వరకు సగటున 10 సంవత్సరాల వార్షిక రాబడి 18 శాతం ఉందని యాక్సిస్ డైరెక్ట్ పేర్కొంది. ఇది స్థిరమైన విలువ పెరుగుదలను సూచిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషనరీ ఒత్తిళ్లను ఎదుర్కొన్నా, వడ్డీ రేట్ల కోతలను చూసినా బంగారం ప్రయోజనం పొందుతుంది. చారిత్రాత్మకంగా, స్టాగ్ఫ్లేషనరీ కాలాల్లో బంగారం దాని ద్రవ్యోల్బణ-నిరోధక లక్షణాల కారణంగా విలువ పెరిగింది. సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) తీసుకునే నిర్ణయాలు, బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

దీనిని కూడా చదవండి : Ponnam Prabhakar | దేశంలో నియంతృత్వానికి తావులేదు : మంత్రి పొన్నం ప్రభాకర్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....