అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Drugs Seizure | హైదరాబాద్ నగరంలోని సూరారంలో ఎక్సైజ్ అధికారులు రూ. 2.58 లక్షల విలువైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు.
యువత, విద్యార్థులు వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా.. గంజాయి, డ్రగ్స్ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎక్సైజ్ అధికారులు (Excise Officials) దాడులు చేసి ఎండీఎంఏ, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ, ఎలిజర్ అలియాస్ సన్నీ నుంచి ఓజీ కుష్‌తో పాటు చరస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు బెంగళూరు నుంచి ఈ మత్తుపదార్థాలను తెప్పించినట్లు సమాచారం. తదుపరి విచారణ కోసం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Hyderabad Drugs Seizure | లాభాల కోసం..
సూరారం–కోంపల్లి హై టెన్షన్ రోడ్డులో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ STF-B బృందం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఎస్సైలు బాలరాజు, సంధ్య, సిబ్బంది ఒక కారును అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ దాడిలో రూ.3.24 గ్రాముల ఎండీఎంఏ, 36.90 గ్రాముల ఓజీ కుష్, 7.73 గ్రాముల చారస్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలు రూ.2.58 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రవాణా కోసం ఉపయోగించిన ఇన్నోవా కారును సీజ్ చేశారు. నిందితులు బెంగళూరు (Bengaluru) నుంచి డ్రగ్స్ సేకరించి లాభాల కోసం ధనవంతులైన యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి..: Bachupally Gandimaisamma Road | బాచుపల్లి– గండిమైసమ్మ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం


