హైదరాబాద్Bachupally Gandimaisamma Road | బాచుపల్లి– గండిమైసమ్మ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

Bachupally Gandimaisamma Road | బాచుపల్లి– గండిమైసమ్మ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

బాచుపల్లి నుంచి గండిమైసమ్మ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. అటవీశాఖ అధికారులు 19 ఎకరాల భూమిని బదలాయించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bachupally Gandimaisamma Road | హైదరాబాద్​ (Hyderabad) నగర శివారులో ట్రాఫిక్​ కష్టాలు తగ్గించడానికి ప్రభుత్వం బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వరకు రోడ్డు విస్తరణకు నిర్ణయించింది. ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి గతంలో ఆమోదం తెలిపింది. అయితే మధ్యలో అటవీ భూమి ఉండటంతో ఇన్ని రోజులు పనులు ముందుకు సాగలేదు.

అటవీశాఖ అధికారులు (Forest Department Officers) తాజాగా 19 ఎకరాల భూమిని బదలాయించారు. దీంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో బాచుపల్లి-బౌరంపేట-గండిమైసమ్మ మార్గంలో ట్రాఫిక్​ తిప్పలు తప్పనున్నాయి.

Bachupally Gandimaisamma Road | తగ్గనున్న ట్రాఫిక్​ రద్దీ

ప్రతిపాదిత కారిడార్ బాచుపల్లి, ప్రగతి నగర్, దుండిగల్, గండిమైసమ్మ, సమీపంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో రోజువారీ ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నందున, ఈ కొత్త కారిడార్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, హైదరాబాద్ పశ్చిమ భాగంలో రద్దీ సమయాల్లోని ట్రాఫిక్ జామ్‌ను తగ్గిస్తుందని ప్రయాణికులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతుండటంతో పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు.

Bachupally Gandimaisamma Road | 6.9 కిలోమీటర్ల మేర..

బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వరకు సుమారు 6.9 కిలోమీటర్ల మేర రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. రూ.135 కోట్ల అంచనా వ్యయంతో హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, బాచుపల్లి, గండిమైసమ్మ పరిసర ప్రాంతాలైన మల్లంపల్లి, ఐడీఏ బొల్లారం మీదుగా ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) వరకు కనెక్టివిటీ మెరుగుపడుతుంది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Convoy | సీఎం రేవంత్​రెడ్డి కాన్వాయ్​లో వాహనాల తగ్గింపు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sugar Export Ban | కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర ఎగుమతులపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sugar Export Ban | కేంద్ర ప్రభుత్వం...

Stock Market Gains | భారీ లాభాల్లో మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | దేశీయ స్టాక్ మార్కెట్...

Uber CEO Delhi Metro| సామాన్యుడిలా ఢిల్లీ మెట్రోలో ఉబర్ సీఈఓ ప్రయాణం

అక్షరటుడే వెబ్‌డెస్క్:Uber CEO Delhi Metro| ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ...