అంతర్జాతీయంMarco Lu Name Change | పేరు మార్చుకున్న అమెరికా మంత్రి.. అసలు కారణం అదేనా?

Marco Lu Name Change | పేరు మార్చుకున్న అమెరికా మంత్రి.. అసలు కారణం అదేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం చైనాలో పర్యటిస్తోంది. ఈ పర్యటన కోసం ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన పేరును ‘మార్కో లూ’గా మార్చుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Marco Lu Name Change | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట విదేశాంగ మంత్రి కూడా ఉన్నాయి.

అయితే ఆయన అసలు పేరు మార్కో రూబియో (Marco Rubio) కాగా.. చైనా పర్యటన కోసం ఆయన ఏకంగా తన పేరునే మార్చుకున్నారు. మార్కో లూ పేరుతో ఆయన చైనాలో పర్యటిస్తుండడం గమనార్హం. అమెరికా విదేశాంగ మంత్రి ఇలా పేరు మార్చుకోవడానికి కారణం ఉంది. అదేమిటో తెలుసుకుందామా..

Marco Lu Name Change | చైనాపై తీవ్ర ఆరోపణలు..

అమెరికా -చైనా మధ్య చాలా అంశాల్లో విభేదాలున్నాయి. చైనా ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తోందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ప్రధానంగా వీగర్ ముస్లింల విషయంలో కఠినవైఖరి అవలంబిస్తోందంటూ సెనెటర్‌గా ఉన్నప్పుడు మార్కో రూబియో తీవ్ర విమర్శలు చేశారు. పది లక్షలకుపైగా వీగర్లు, ఇతర ముస్లింలను శిబిరాల్లో నిర్బంధించి, బలవంతపు చాకిరీ చేయిస్తున్నారని, లైంగిక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురయిన చైనా.. ఆ వ్యాఖ్యలు, ఆరోపణలను ఖండించడమే కాకుండా.. మార్కో రూబియో చైనాలో పర్యటించకుండా 2020లోనే నిషేధం విధించింది. ఆ నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది.

Marco Lu Name Change | నిషేధం ఉన్నా అడ్డుకోని డ్రాగన్ కంట్రీ..

చైనాలో పర్యటిస్తున్న అమెరికా బృందంలో మార్కో రూబియో ఉన్నారు. అయితే తన పర్యటనను చైనా అడ్డుకోకుండా ఉండేందుకు పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తన పేరును మార్కో రూబియో నుంచి ‘మార్కో లూ’గా మార్చుకుని చైనాకు వచ్చారు. పేరు స్పెల్లింగ్ ఆధారంగా నిషేధం అమలులో ఉన్నందున ఆయన తన ఇంటిపేరును ‘లూ’ అనే చైనీస్ పదంతో భర్తీ చేశారని ఇద్దరు దౌత్యవేత్తలు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. కాగా రూబియో పర్యటనపై నిషేధం ఉన్నా చైనా అడ్డుకోకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Global Cost Cutting | అంతటా పొదుపు మంత్రమే.. 40కి పైగా దేశాల్లో ఆంక్షలు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Trump Secret Letter| ట్రంప్ పర్యటన వేళ జేడీ వాన్స్‌కు ‘సీక్రెట్ లెటర్’.. అందులో ఏముంది?

అక్షరటుడే వెబ్‌డెస్క్:Trump Secret Letter|అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చైనాలో...

Vivo X300 Ultra | ఫొటోగ్రఫీ లవర్స్ కోసం.. వీవోనుంచి మరో ఫోన్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo X300 Ultra | చైనాకు చెందిన...

Singareni New Jobs | కొత్త గనులు, కొత్త ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వివేక్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni New Jobs | సింగరేణికి పూర్వ...

Red Fort Bomb Blast|ఎర్రకోట బాంబు పేలుడు కేసు.. 10 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ భారీ ఛార్జిషీట్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Red Fort Bomb Blast|ఢిల్లీలోని ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) వద్ద...