జాబ్స్​ & ఎడ్యుకేషన్​Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

Telangana ANM Results | ఏఎన్​ఎం పరీక్ష ఫలితాలు విడుదల

వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి 1,931 ఏఎన్​ఎం పోస్టుల కోసం తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana ANM Results | వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి (MHSRB) 1,931 ఏఎన్​ఎం పోస్టుల కోసం తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ ఫలితాలకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు మే 18 నుంచి 22 వరకు అవకాశం కల్పించారు.

తెలంగాణలో 1931 ఏఎన్​ఎం పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫకేషన్​ విడుదల చేశారు. మొత్తం 24,268 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 20,600 మంది అభ్యర్థులు పరీక్ష (CBT)కు హాజరు అయ్యారు. ఆ పరీక్ష ఫలితాలను తాజాగా MHSRB విడుదల చేసింది.

Telangana ANM Results | వెయిటేజీ తగ్గింపు

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సేవలకు కేటాయించే వెయిటేజీ మార్కులను హైకోర్టు ఆదేశాల మేరకు 30 నుంచి 20 మార్కులకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష మార్కులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సేవలకు సవరించిన వెయిటేజీ మార్కుల ఆధారంగా నియామక మండలి తాత్కాలిక జాబితాను విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపింది. వాటిని సమర్పించేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది.

మొత్తం పోస్టులలో 1,666 ఖాళీలు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఉండగా, 265 పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నాయి. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన తుది తీర్పులకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : NEET Paper Leak | విద్యార్థుల గొంతుకపై ‘లీకేజీ’ కత్తి.. నీట్ కుంభకోణం వెనుక అసలు దందా ఇదేనా?

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Police | నాటుతుపాకీతో కాల్చుకుని ఓ యువకుడి...

Modi Lavrov Meeting | ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Lavrov Meeting | రష్యా విదేశాంగ...

Paddy Procurement | చివరి గింజ వరకు కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement | రైతులు పండించిన ధాన్యం...

Grain Purchase Delay | ​ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం

అక్షరటుడే, భీమ్​గల్: Grain Purchase Delay | ధాన్యం కొనుగోలు (paddy...