అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Students | తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో అనేక మార్పులు చేసింది. ఇక నుంచి ఫస్టియర్‌లో సైతం ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఇంటర్ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి. గతంలో ఇంటర్ సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి ఫస్టియర్‌లో కూడా ప్రయోగ పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్స్‌కు ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
Inter Students | మ్యాథ్స్ పరీక్ష 60 మార్కులకే..
ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీ (MPC)లో మ్యాథ్స్ –ఏ, మ్యాథ్స్–బీ పరీక్షలు 75 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ 60 మార్కులకు ఉంటాయి. ఇక నుంచి మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా 60 మార్కులకే పెట్టనున్నారు. గణితంలో నూతనంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ఇంటర్ బోర్డు (Inter Board) తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. గతంలో సెకండియర్ (Second Year)లో ప్రాక్టికల్ పరీక్షలకు 30 మార్కులు ఉండేవి. ఇప్పుడు వాటిని ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కుల చొప్పున విభజించారు.
Inter Students | సిలబస్‌లో మార్పులు
హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులలో కూడా కొత్తగా ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ABL) విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఫైనల్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. ఇంటర్నల్స్ ద్వారా 20 మార్కులు కేటాయిస్తారు. సిలబస్‌లో కూడా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త పుస్తకాలను ముద్రించారు. మరోవైపు ఇంటర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా ‘ACE’ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కోర్సు ప్రవేశ పెట్టారు.
దీనిని కూడా చదవండి : Formula E Race Case | ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు కోర్టు సమన్లు


