తెలంగాణInter Students | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంటర్​లో కీలక మార్పులు

Inter Students | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంటర్​లో కీలక మార్పులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్​ విద్యలో అనేక మార్పులు చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Students | తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్​ విద్యలో అనేక మార్పులు చేసింది. ఇక నుంచి ఫస్టియర్​లో సైతం ఫిజిక్స్‌ (Physics), కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఇంటర్​ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి. గతంలో ఇంటర్​ సెకండియర్​లో మాత్రమే ప్రాక్టికల్​ పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి ఫస్టియర్​లో కూడా ప్రయోగ పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్స్‌కు ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

Inter Students | మ్యాథ్స్​ పరీక్ష 60 మార్కులకే..

ప్రస్తుతం ఇంటర్​ ఎంపీసీ (MPC)లో మ్యాథ్స్​ –ఏ, మ్యాథ్స్​–బీ పరీక్షలు 75 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్​, కెమిస్ట్రీ 60 మార్కులకు ఉంటాయి. ఇక నుంచి మ్యాథ్స్​ ఎగ్జామ్​ కూడా 60 మార్కులకే పెట్టనున్నారు. గణితంలో నూతనంగా యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ను ఇంటర్‌ బోర్డు (Inter Board) తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. గతంలో సెకండియర్ (Second Year)​లో ప్రాక్టికల్​ పరీక్షలకు 30 మార్కులు ఉండేవి. ఇప్పుడు వాటిని ఫస్టియర్​లో 15 మార్కులు, సెకండియర్​లో 15 మార్కుల చొప్పున విభజించారు.

Inter Students | సిలబస్​లో మార్పులు

హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులలో కూడా కొత్తగా ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ABL) విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఫైనల్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది. ఇంటర్నల్స్​ ద్వారా 20 మార్కులు కేటాయిస్తారు. సిలబస్​లో కూడా ఇంటర్​ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త పుస్తకాలను ముద్రించారు. మరోవైపు ఇంటర్​ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా ‘ACE’ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కోర్సు ప్రవేశ పెట్టారు.

దీనిని కూడా చదవండి : Formula E Race Case | ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌కు కోర్టు సమన్లు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SI Love Fraud | ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్సై టోకరా.. కటకటాల్లో కీచక ఖాకీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SI Love Fraud | రక్షణ కల్పించాల్సిన రక్షక...

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల సీజ్​..

అక్షరటుడే, భీమ్​గల్: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై...

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khushbu | ఒకప్పుడు దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో...

Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Police | నాటుతుపాకీతో కాల్చుకుని ఓ యువకుడి...