SI Love Fraud | ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్సై టోకరా.. కటకటాల్లో కీచక ఖాకీ!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SI Love Fraud | రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. తోటి ఉద్యోగి అని కూడా చూడకుండా, ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఘటనలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) సస్పెన్షన్‌కు గురయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

SI Love Fraud | అసలేం జరిగిందంటే..?

2018 బ్యాచ్‌కు చెందిన సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని సురేష్ కుమార్ గట్టిగా హామీ ఇవ్వడంతో, సదరు యువతి అతన్ని పూర్తిగా నమ్మింది.

SI Love Fraud | పెళ్లి ప్రస్తావన రాగానే అసలు రంగు బయటపడింది!

గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెచ్చినప్పటికీ, సురేష్ కుమార్ రకరకాల సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సురేష్ తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన బాధితురాలు అతన్ని గట్టిగా నిలదీయగా, “నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు” అని అతను తెగేసి చెప్పాడు.

SI Love Fraud | పరారీలో ఎస్సై.. వేటు వేసిన ఉన్నతాధికారులు

మోసపోయానని గ్రహించిన మహిళా కానిస్టేబుల్ వెంటనే కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, ఎస్సై సురేష్ కుమార్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. బాధితురాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

“చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఇలాంటి నేరాలకు పాల్పడటం శాఖకు మచ్చ తెచ్చే విషయం. విచారణ అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Inter Students | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంటర్​లో కీలక మార్పులు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *