నిజామాబాద్Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో

Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో

అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్ అన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి, మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణపై ఎన్జీవోలతో డీఎఫ్​వో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్ (DFO siddharth vikram singh) అన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి, మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణపై ఎన్జీవోలతో ఆయన డీఎఫ్​వో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

Forest Wildlife Conservation | నందిపేట్​ ప్రాంతంలో..

ఈ సందర్భంగా అటవీ, కాకతీయ సాండ్​బాక్స్ ​(Kakatiya Sandbox) సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. నందిపేట్​ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు, మానవ-వన్యప్రాణి ఘర్షణలను తగ్గించే చర్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలోని (Forest Department) ప్రకృతి సంపద, అటవీ ప్రాంతాలు, జల వనరులు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఎకో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు అవకాశాలను ప్రస్తావించారు. ఇటువంటి సమగ్ర అభివృద్ధి ద్వారా నిజామాబాద్ జిల్లాను జాతీయస్థాయి పర్యాటక పటంలో ప్రముఖ స్థానంలో నిలపవచ్చని డీఎఫ్‌వో తెలిపారు.

Forest Wildlife Conservation | స్థానిక గ్రామీణ యువతకు ఉపాధి..

ఎకో టూరిజం (Eco tourism) అభివృద్ధి ద్వారా స్థానిక గ్రామీణ యువత, మహిళా సంఘాలు, అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని డీఎఫ్​వో పేర్కొన్నారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణకు భంగం కలగకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో అటవీశాఖ అధికారులు ముఖ్య భూమిక పోషించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Meta Layoffs | 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి గొప్ప మనసు.. బాలుడి చికిత్సకు చేయూత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి...

GHMC MoU | ఐఐటీ ఖరగ్​పూర్​తో జీహెచ్​ఎంసీ ఒప్పందం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC MoU | అత్యంత అధునాతన ఏఐ...

RTC Merger Talks|ఆర్టీసీ విలీనంపై కసరత్తు..కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భేటీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:RTC Merger Talks|తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన...