Indulekha Hair Serum|జుట్టు రాలే సమస్యకు సైంటిఫిక్ సొల్యూషన్.. ఇందులేఖ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Indulekha Hair Serum|ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్‌ను జోడిస్తూ ‘ఇందులేఖ’ రూపొందించిన భృంగా హెయిర్ గ్రోత్ సీరమ్ తన ప్రభావాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఉత్పత్తిపై నిర్వహించిన రెండవ భారీ క్లినికల్ అధ్యయనం విజయవంతంగా పూర్తయిందని, దీని ద్వారా కేవలం 90 రోజుల్లోనే 11,000 కంటే ఎక్కువ కొత్త వెంట్రుకలు మొలుస్తున్నట్లు శాస్త్రీయంగా నిరూపితమైందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Indulekha Hair Serum|అధ్యయనంలో వెల్లడైన కీలక అంశాలు..

2024 , 2025 మధ్య కాలంలో 20 నుంచి 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తులపై (పురుషులు , మహిళలు) ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందులో తేలిన ప్రధాన విషయాలు ఇవే:

Indulekha Hair Serum|వేగవంతమైన పెరుగుదల..

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 3 శాతం రెడెన్సిల్ (Redensyl) సీరమ్‌లతో పోలిస్తే, ఇందులేఖ సీరమ్ రెండు రెట్లు వేగంగా జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అనాజెన్-టు-టెలోజెన్ (A:T) నిష్పత్తిలో 74 శాతం వృద్ధి కనిపించింది. అంటే జుట్టు రాలడం తగ్గి, పెరుగుదల దశ (Growth phase) పెరుగుతుంది. ఈ సీరమ్ వాడిన వారిలో 100% మంది జుట్టు ఒత్తుగా మారిందని, 97% మంది జుట్టు రాలడం గణనీయంగా తగ్గిందని ధృవీకరించారు.

Indulekha Hair Serum|కుదుళ్ల స్థాయి నుంచి రక్షణ..

ఈ అధ్యయన ఫలితాల ప్రకారం, ఈ ఆయుర్వేద ఫార్ములేషన్ నేరుగా కుదుళ్ల (Follicular level) వద్ద పనిచేసి జుట్టు మందాన్ని పెంచుతుంది. సుమారు 97% మంది వినియోగదారులు జుట్టు పరిమాణం (Volume) పెరిగినట్లు అంగీకరించారు. చర్మవ్యాధి నిపుణులు, ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం విశేషం.

Indulekha Hair Serum|పారదర్శకతే మా లక్ష్యం..

“ఆయుర్వేద సూత్రాలను కఠినమైన క్లినికల్ పరీక్షలతో కలపడమే మా విధానం” అని యూనిలీవర్ హెయిర్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ సాయిరామ్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. వినియోగదారులకు తమ ఉత్పత్తిపై పూర్తి నమ్మకాన్ని కల్పించేందుకే రెండు స్వతంత్ర క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని ఆయన వివరించారు. కాగా, 2025 నాటి ఈ ఫలితాలను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ డెర్మటాలజీ’లో ప్రచురణ కోసం సమర్పించారు.

భారతీయ స్కాల్ప్ లక్షణాలకు అనుగుణంగా, ఇక్కడి వ్యక్తులపైనే ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల భారతీయులకు ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: Petrol Price Hike | నాలుగేళ్ల తర్వాత పెట్రోల్ ధరల పెంపు.. మరో 30 శాతం వడ్డన తప్పదా?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *