అక్షరటుడే, వెబ్డెస్క్: Gaini Dayasagar Dalitha Ratna | భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక ‘దళిత రత్న’ అవార్డు అందుకున్న వీఆర్ఏల (VRA) సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా మాల మహానాడు నగర అధ్యక్షులు గైని దయసాగర్ను శనివారం పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
Gaini Dayasagar Dalitha Ratna |
సమాజంలో దళితుల హక్కుల కోసం, ముఖ్యంగా వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం గైని దయసాగర్ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు అందించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో దయసాగర్ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Gaini Dayasagar Dalitha Ratna |
ఈ సన్మాన కార్యక్రమంలో జీపీఓ (GPO) జిల్లా అధ్యక్షులు సాయినాథ్, ప్రధాన కార్యదర్శి గున్నం సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు నీరడి రమేష్, కార్యవర్గ సభ్యులు తలారి కిషోర్, పూర్వ వీఆర్ఏలు (VRA) సుంకరి లక్ష్మణ్, గైని భాస్కర్, ఎర్గం సాయిలు, సాదు అనిల్, మల్కన్న, జనార్దన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


