తెలంగాణNanded Dharmavaram Express | నాందేడ్​–ధర్మవరం వీక్లీ ఎక్స్​ప్రెస్​ క్రమబద్ధీకరణ

Nanded Dharmavaram Express | నాందేడ్​–ధర్మవరం వీక్లీ ఎక్స్​ప్రెస్​ క్రమబద్ధీకరణ

నిజామాబాద్​ జంక్షన్ మీదుగా నడుస్తున్న నాందేడ్‌‌‌‌– ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు క్రమబద్ధీకరించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nanded Dharmavaram Express | నిజామాబాద్​ (Nizamabad) జంక్షన్ మీదుగా నడుస్తున్న 07189/90 నాందేడ్‌‌‌‌– ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ నాందేడ్ డివిజన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రైలు పెద్దపల్లి – వరంగల్ – విజయవాడ – గూడూరు – తిరుపతి – పాకాల మీదుగా ధర్మవరం వెళ్తుంది. క్రమబద్దీకరించిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17636/35గా మారింది.

నాందేడ్ –ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం నిజామాబాదు జంక్షన్​కు సాయంత్రం 6:58 గంటలకు వచ్చి 7 గంటలకు బయలుదేరుతుంది. రెండు నిమిషాలు హాల్ట్ సౌకర్యం ఉంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి ఆదివారం ధర్మవరంలో ఉదయం 05:25 గంటలకు బయలుదేరి, తిరుపతి రైల్వే స్టేషన్​కు ఉదయం 10:30 గంటలకు వచ్చి 10:40 నిమిషాలకు బయలుదేరుతుంది, సోమవారం ఉదయం 4 గంటలకు నిజామాబాదు జంక్షన్​కు వచ్చి 4:05 నిమిషాలకు బయలుదేరుతుంది.

Nanded Dharmavaram Express | ప్రముఖ ఆలయాల మీదుగా..

ఈ రైలు ద్వారా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కదిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం, తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం, బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటుగా సిక్కుల పవిత్ర స్థలం నాందేడ్ లోని గురుద్వారా దర్శనం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ రైలుకు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్​లో హాల్ట్ లేదు. ఈ ట్రైన్​కు నిజామాబాద్​ జంక్షన్​తోపాటు ఆర్మూర్ రైల్వే స్టేషన్​లో స్టాప్ సదుపాయం కల్పించారు.

Nanded Dharmavaram Express | 20 బోగీలు

నాందేడ్ –ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో 8 స్లీపర్ బోగీలు, 6 థర్డ్​ ఏసీ, 2 సెకండ్​ ఏసీ బోగీల తో పాటు 4 సాధారణ జనరల్ బోగీలు ఉంటాయి. మొత్తంగా 20 బోగీలు ఉంటాయి. అధికారికంగా ఈ రైలు ఆదివారం ధర్మవరం జంక్షన్​లో ప్రారంభం అవుతుంది.

ఇది కూడా చదవండి..: Bandi Bhagirath POCSO | ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేం.. బండి భగీరథ్​ కేసులో హైకోర్టు స్పష్టం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chandrababu Population Policy | మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandrababu Population Policy | ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి...

Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై...

Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన మనవడు.. కాపాడబోయి తాత మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Borewell Rescue Tragedy | బోరుబావిలో పడిన...

Bhogapuram Airport Protest | రోడ్డు పనులు అడ్డుకున్న రైతులు.. జేసీబీ బకెట్​తో పక్కకు తొలగించిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhogapuram Airport Protest | ఏపీలోని విజయనగరం...