తెలంగాణBandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్

Bandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్

పోక్సో కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్​ లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో పేట్‌ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్​ అయ్యాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhageerath Surrender | తనపై నమోదు అయిన పోక్సో కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్​ లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో పేట్‌ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

బండి భగీరథ్​పై నమోదు అయిన పోక్సో కేసు (POCSO Case) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఓ బాలికను లైంగికంగా వేధించాడని అతడిపై మే 8న కేసు నమోదు అయింది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ (SIT)​ ఏర్పాటు చేసింది. విచారణకు హాజరు కావాలని సిట్​ అధికారులు నోటీసులు పంపినా భగీరథ్​ స్పందించలేదు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు (High Court)ను ఆశ్రయించాడు. అయితే కోర్టు బెయిల్ నిరాకరించింది.

Bandi Bhageerath Surrender | పోలీసుల లుకౌట్ నోటీసులు

బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడం, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో భగీరథ్​ లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుతో ఆయన తండ్రికి ఇప్పటికే భారీగా పొలిటికల్ డ్యామేజీ అయింది. ముఖ్యంగా బీఆర్​ఎస్​ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో భగీరత్​ లొంగిపోయారు.

Bandi Bhageerath Surrender | చట్టంపై గౌరవం ఉంది

తన కుమారుడు లొంగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)​ స్పందించారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అన్నారు. చట్టంపై గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని చెప్పారు. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగిందన్నారు. ఏ తప్పూ చేయలేదని భగీరథ్‌ అంటున్నాడని చెప్పారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని సంజయ్​ తెలిపారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Convoy | నా కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ ఆపొద్దు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక నిర్ణయం

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Chola Copper Plates | భారతీయ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో మరో...

Saraswati Antya Pushkaralu | ఈనెల 21 నుంచి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Saraswati Antya Pushkaralu | కాళేశ్వరంలో ఈనెల 21...

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Southwest Monsoon Kerala | ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు...

Nizamabad Ganja Seizure | నగరంలో భారీగా గంజాయి పట్టివేత

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలోని రైల్వేస్టేషన్​లో...