అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CNG Price Hike | కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై ఒక రూపాయి పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం సీఎన్జీ ధర రెండు రూపాయలు పెరిగింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు (Crude Oil) ధరల పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇంధన రేట్లను పెంచిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.3 మేర పెంచింది. సీఎన్జీ ధరలను కిలోకు రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయి. తాజాగా ఆదివారం ఉదయం మరోసారి సీఎన్జీ ధరలను కేంద్రం పెంచింది. రెండు రోజుల వ్యవధిలో రేట్లు పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CNG Price Hike | పెంపు తర్వాత రేట్లు..
ఢిల్లీ (Delhi)లో కిలో CNG ధర రూ. 80.09 ఉంటుంది. నోయిడా-ఘజియాబాద్‌లలో కిలో CNG ధర రూ. 88.70 ఉంటుంది. కేవలం రెండు రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. పెరుగుతున్న ధరలు ఆటో-రిక్షా డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ప్రైవేట్ వాహన యజమానుల నెలవారీ బడ్జెట్‌లను తలకిందులు చేశాయి. ప్రతిరోజూ సుదూర ప్రయాణాలు చేసేవారి జేబులపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. రేట్ల పెంపు తర్వాత ముంబైలో సీఎన్జీ ధర రూ.84కు చేరుకుంది.
CNG Price Hike | వాహనదారుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రేట్లు పెంచకుండా విడతలవారిగా పెంచుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలోని చమురు సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో ఇంధన రేట్లను పెంచుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. అయితే రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.
CNG rates have been increased by Re 1 from today. In Delhi, per KG CNG will cost Rs 80.09. In Noida-Ghaziabad, per KG CNG will cost Rs 88.70. This is the second increase in prices in 2 Days. Earlier on 15th May, CNG prices were increased to Rs 2/KG.
— ANI (@ANI) May 17, 2026
దీనిని కూడా చదవండి : Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం


