అక్షరటుడే, వెబ్‌డెస్క్ : iBomma website | ఐ బొమ్మ వెబ్‌సైట్ మళ్లీ ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే. ఆ వెబ్సైట్లో కొత్త సినిమాలను అప్లోడ్ చేశారు. దీంతో చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) ప్రతినిధులు సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో ఐ బొమ్మ వెబ్‌సైట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ (Hyderabad) పోలీసులు ఐ బొమ్మ వెబ్‌సైట్, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడి చేత ఆ వెబ్‌సైట్ క్లోజ్ చేయించారు. దీంతో కొన్ని రోజులుగా ఐ బొమ్మ సైట్ మనుగడలో లేదు. ఇటీవల మళ్లీ వెబ్‌సైట్ ప్రత్యక్షం అయింది.
iBomma website | నాకు సంబంధం లేదు
ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. దీంతో రవి మళ్లీ వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లు పలువురు భావించారు. అయితే కొత్తగా వచ్చిన ఐ బొమ్మ వెబ్‌సైట్‌తో తనకు సంబంధం లేదని రవి స్పష్టం చేశారు. ఐ బొమ్మ పేరును వాడుకుని కేటుగాళ్లు కొత్తగా వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఇటీవల విడుదలైన సినిమాలు అందులో పెట్టారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : iBomma Website | టాలీవుడ్‌కు షాక్.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది


