సినిమాTelugu Film Chamber | ‘పర్సంటేజీ’ వివాద పరిష్కారానికి సురేష్ బాబు నేతృత్వంలో సబ్‌-కమిటీ ఏర్పాటు

Telugu Film Chamber | ‘పర్సంటేజీ’ వివాద పరిష్కారానికి సురేష్ బాబు నేతృత్వంలో సబ్‌-కమిటీ ఏర్పాటు

పర్సంటేజీల వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించాల్సి ఉంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో టాలీవుడ్‌లో సజావుగా వ్యాపారాలు సాగేలా ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన కీలక సమావేశం ముగిసింది. టాలీవుడ్‌లో గత కొంతకాలంగా నెలకొన్న పలు అంశాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన ‘పర్సంటేజీ విధానం’పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

థియేటర్ల నిర్వహణ, కలెక్షన్ల షేరింగ్‌కు సంబంధించిన పర్సంటేజీల వ్యవహారంలో తలెత్తిన సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఛాంబర్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telugu Film Chamber | ప్రత్యేక సబ్‌-కమిటీ ఏర్పాటు

ఈ వివాదాల శాశ్వత పరిష్కారం చూపేందుకు ఫిల్మ్‌ ఛాంబర్ ఒక ప్రత్యేక సబ్‌-కమిటీని ఏర్పాటు చేసింది.

ఛైర్మన్‌: నిర్మాత డి.సురేష్‌బాబు

కన్వీనర్లు: దిల్‌ రాజు Dil Raju, అల్లు అరవింద్‌, కే.ఎల్ నారాయణ, కె. అశోక్‌ కుమార్‌

పరిశ్రమలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, ఈ సబ్‌ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సమ ప్రాధాన్యం కల్పించారు.

ఈ కమిటీ సభ్యులు సమావేశమై, పర్సంటేజీల వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించాల్సి ఉంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో టాలీవుడ్‌లో సజావుగా వ్యాపారాలు సాగేలా ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Jayam Ravi Divorce | ‘నా భార్య విడాకులు ఇచ్చేవరకు సినిమాలు చేయను’ – జయం రవి సంచలన ప్రకటన!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...