EAPCET results | EAPCET ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల సత్తా

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: EAPCET results | తెలంగాణ EAPCET ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో విద్యార్థులు స్టేట్​ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ అధ్యాపకుల మార్గదర్శకత్వంలో లక్ష్యసాధనకు కృషి చేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతో పాటు EAPCET‌కు ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం EAPCETలో కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

EAPCET results | ర్యాంకులు సాధించింది వీరే..

అబ్దుల్ షాహిద్ 3406 ర్యాంక్ సాధించగా.. ఆత్రిజ్ 3862, ఎ.వచన్ 4,974, భావకీర్తన్ 5,963, లోక సామిక్ష 6,085, ఈ.శరత్ చంద్ర 7,003, సిద్ధి వినాయక్ 7,350, మైరతైతెల్ 7,390, సదియా ఫిర్దౌస్ 7,830, సుజానా 8,450, తుబా ఫాతిమా 9,666, ఐషా ఆలం 10,990 ర్యాంకులు సాధించారు.

EAPCET results | నాణ్యమైన విద్యా విధానంతోనే..

కాకతీయ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానంతోనే ఉత్తమ ర్యాంకులు సాధ్యమయ్యాయని ఛైర్​పర్సన్​ తెలిపారు. పారదర్శకత, నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన విద్య అందించడంతో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొన్ని విద్యాసంస్థలు వివిధ బ్రాంచ్‌లలో వచ్చిన స్టేట్ ర్యాంకులను తమ బ్రాంచ్‌కు చెందినవిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. తల్లిదండ్రులు సరైన సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాకతీయ విద్యాసంస్థల పరిధిలోని రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులు సాధించిన ఒకే బ్రాంచ్ నుంచే వచ్చినవని స్పష్టం చేస్తున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Drone Attack | యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్​ దాడి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *