అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar Train Fire | బీహార్‌లోని ససారం రైల్వే స్టేషన్ (Sasaram Railway Station)లో పాట్నాకు వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పలు బోగీలు కాలిపోయాయి.
ససారం రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంతో ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రైల్వే పోలీసులు (Railway Police) ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక బృందం సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రైలులోని ఒక కోచ్ పూర్తిగా ధ్వంసమైంది.
Bihar Train Fire | వరుస ఘటనలు
ఇటీవల రైళ్లలో అగ్రి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని రత్లాంలో ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సైతం ఆగి ఉన్న రైలులో మంటలు వ్యాపించి పలు బోగీలు కాలిపోయాయి. అగ్ని ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా బీహార్‌లో జరిగిన ఘటనలో రైలు బయలు దేరడానికి కొన్ని నిమిషాల ముందు ప్రమాదం జరిగింది. అదే రైలు బయలుదేరాక మంటలు అంటుకొని ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Modi Sweden Award | స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ కైవసం చేసుకున్న మోడీ


